News December 24, 2024

అశ్విన్ స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్

image

ఆస్ట్రేలియాతో మిగతా రెండు టెస్టులకు అశ్విన్ స్థానంలో యువ క్రికెటర్, అన్‌క్యాప్డ్ ప్లేయర్ తనుష్ కోఠియన్‌ను BCCI అనూహ్యంగా ఎంపిక చేసింది. బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఆయన జట్టులో చేరనున్నట్లు తెలిపింది. ఈ ముంబై ఆల్‌రౌండర్ 33 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 101 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 1,521 పరుగులు చేశారు. వీటిలో రెండు సెంచరీలు ఉన్నాయి.

Similar News

News January 22, 2025

INDvsENG టీ20ల్లో మోస్ట్ రన్స్, వికెట్స్ వీరివే

image

☛ మోస్ట్ రన్స్: విరాట్ కోహ్లీ – 648 (38.11 avg), జోస్ బట్లర్ – 498 (33.20), రోహిత్ శర్మ – 467 (35.92), జాసన్ రాయ్ – 356 (23.73), ఇయాన్ మోర్గాన్ – 347 (26.69)

☛ మోస్ట్ వికెట్స్: జోర్డాన్ (24), చాహల్ (16), హార్దిక్ (14), బుమ్రా (9), భువనేశ్వర్ (9).

News January 22, 2025

‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ విడుదల ఫిక్స్?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా 5 వారాలు పూర్తయ్యాక ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14వ తేదీన స్ట్రీమింగ్‌కు వస్తుందని అంచనా వేశాయి. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

News January 22, 2025

సంతోషకరమైన దేశాల్లో ఇండియా ఏ స్థానమంటే?

image

ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలిచింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్-2024 ప్రకారం టాప్‌-100లో ఇండియా లేకపోవడం గమనార్హం. డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా టాప్-10 హ్యాపీయెస్ట్ కంట్రీస్‌గా నిలిచాయి. ఇండియా 126వ స్థానంలో ఉంది. ఇండియా ఈ ప్లేస్‌లో ఉండటానికి గల కారణాలేంటో మీకు తెలుసా?