News March 16, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థులు వీరే

➢తిరువూరు- నల్లగట్ల స్వామిదాసు
➢కైకలూరు- దూలం నాగేశ్వరరావు
➢గన్నవరం- వల్లభనేని వంశీ
➢గుడివాడ- కొడాలి నాని
➢పెడన- ఉప్పాల రాము
➢మచిలీపట్నం- పేర్ని వెంకట సాయికృష్ణ
➢అవనిగడ్డ- సింహాద్రి రమేశ్ బాబు
➢పామర్రు- కైలే అనిల్ కుమార్
➢నూజివీడు- మేకా వెంకట ప్రతాప అప్పారావు ఓసీ
Similar News
News August 17, 2025
ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నేపథ్యం ఇదే

C.P. రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి <<17436465>>రాధాకృష్ణన్<<>>. ఈయన 1957లో తమిళనాడులో జన్మించారు. 16 ఏళ్ల వయసు నుంచే RSS, జన్ సంఘ్‌లో పని చేశారు. 1998, 99లో కోయంబత్తూరు BJP ఎంపీగా గెలిచారు. 2004, 14, 19లో ఓడిపోయారు. 2004-07 వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పని చేశారు. 2023లో ఝార్ఖండ్ గవర్నర్‌గా ఎంపికయ్యారు. 2024లో TG గవర్నర్ గానూ అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులైలో MH గవర్నర్‌గా నియమితులయ్యారు.
News August 17, 2025
డైరెక్టర్‌గా నాకు నాగార్జున జన్మనిచ్చారు: RGV

తల్లిదండ్రులు వ్యక్తిగా తనకు జన్మనిస్తే, ‘శివ’ సినిమాతో డైరెక్టర్‌గా నాగార్జున జన్మనిచ్చారని దర్శకుడు RGV తాజాగా ఓ షోలో అన్నారు. ‘ఆ సమయంలో నేను నమ్మిందే చేయాలని ఆయన పట్టుబట్టారు. అనుభవం లేని నన్ను 100% నమ్మింది నాగార్జునే. పలు సమస్యలు ఎదురైనా నాగ్ నాకు అండగా నిలిచారు’ అని పేర్కొన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘శివ’ టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే.
News August 17, 2025
జీఎస్టీ సంస్కరణలకు సహకరించండి: మోదీ

నెక్స్ట్ జనరేషన్ GST సంస్కరణల అమలుకు సహకరించాలని రాష్ట్రాలను ప్రధాని మోదీ కోరారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించామని చెప్పారు. ఈ సంస్కరణలు పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు చిన్న, పెద్ద వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తాయని ఓ కార్యక్రమంలో తెలిపారు. ఇవి సుపరిపాలనకు మరింత దోహదం చేస్తాయని, ఈ దీపావళి జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు డబుల్ బోనస్ ఇస్తుందని పేర్కొన్నారు.