News March 16, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థులు వీరే
➢తిరువూరు- నల్లగట్ల స్వామిదాసు
➢కైకలూరు- దూలం నాగేశ్వరరావు
➢గన్నవరం- వల్లభనేని వంశీ
➢గుడివాడ- కొడాలి నాని
➢పెడన- ఉప్పాల రాము
➢మచిలీపట్నం- పేర్ని వెంకట సాయికృష్ణ
➢అవనిగడ్డ- సింహాద్రి రమేశ్ బాబు
➢పామర్రు- కైలే అనిల్ కుమార్
➢నూజివీడు- మేకా వెంకట ప్రతాప అప్పారావు ఓసీ
Similar News
News October 8, 2024
14 నుంచి ‘పల్లె పండుగ’
AP: గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహించనుంది. ఇవాళ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా రూ.2,500 కోట్ల ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులతో 20 వేల పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేయనున్నారు. రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
News October 8, 2024
బఫర్ జోన్‌లో ఉన్నవి కూల్చడం లేదు: భట్టి
TG: మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంలోని నిర్మాణాలనే తొలగిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణ, చెరువుల ఆక్రమణలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో పూర్తిగా 44, పాక్షికంగా 127 చెరువులు కబ్జాకు గురైనట్లు వెల్లడించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50లక్షల కోట్లు అనే వార్తలను ఆయన కొట్టిపారేశారు.
News October 8, 2024
ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో రాయితీపై టమాటా, ఉల్లి
AP: సెంచరీ దాటిన టమాటా, ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేరుగా రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లోని రైతు బజార్లలో కిలో టమాటా రూ.50, ఉల్లి రూ.40-45 చొప్పున విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డుతో వెళితే కుటుంబానికి కిలో చొప్పున ఇస్తామన్నారు.