News December 24, 2024

ఇన్సూరెన్స్‌లో లోయెస్ట్ రిజెక్షన్ రేటు ఎవరిదంటే?

image

అత్యల్ప క్లెయిమ్స్ రిజెక్షన్ రేషియో 0.2%తో న్యూఇండియా అస్యూరెన్స్ రికార్డు సృష్టించింది. దాదాపుగా క్లెయిమ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా డబ్బును బదిలీ చేసింది. ప్రైవేటులో HDFC Ergo, Future Generali, ఆదిత్య బిర్లా హెల్త్, శ్రీరామ్ ముందున్నాయి. ఇక 2022-23లో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ టు సెటిల్మెంట్ రేషియో 86 శాతమని IBAI డేటా ద్వారా తెలుస్తోంది. FY22తో పోలిస్తే ఒకశాతం తగ్గడం గమనార్హం.

Similar News

News March 15, 2026

గిల్, మంధానకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

image

2024-2025 ఏడాదికి గానూ క్రికెటర్లు గిల్, మంధానను ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. అంతర్జాతీయ మెన్స్ క్రికెట్‌లో గొప్ప గౌరవంగా భావించే పాలీ ఉమ్రిగర్ అవార్డును గిల్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది బెస్ట్ ఇంటర్నేషనల్ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధానను BCCI ఎంపిక చేసింది. ఈమె ఈ అవార్డు అందుకోవడం ఐదోసారి కావడం విశేషం. ఢిల్లీలో జరిగిన నమన్ అవార్డ్స్-2026 వేడుకలో వీరిద్దరూ ఈ పురస్కారాలు అందుకున్నారు.

News March 15, 2026

కమ్యూనిస్ట్ గడ్డపై కమలం వికసిస్తుందా?

image

సౌత్ ఇండియాపై కన్నేసిన BJP కమ్యూనిస్ట్ గడ్డ కేరళంపై జెండా ఎగురవేయాలని చూస్తోంది. పినరయి విజయన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, శబరిమల గోల్డ్ చోరీ కేసును అవకాశంగా మలుచుకుంటోంది. అటు కేరళంలో BJPని అడుగుపెట్టనివ్వబోమని విజయన్ అంటున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. <<19389988>>మే 4న<<>> వెలువడే ఫలితాలు కేరళం రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి..

News March 15, 2026

పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్

image

AP: పార్టీ చీఫ్ చంద్రబాబు <<19391495>>ఆదేశాలతో<<>> పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని TDP రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.