News December 24, 2024
ఇందిరమ్మ ఇళ్లపై BIG UPDATE
TG: సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించామని, నిన్నటి వరకు 32 లక్షల దరఖాస్తులు పరిశీలించామన్నారు. తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం ఇస్తామన్నారు. రేషన్‌కార్డులతో సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తాయన్నారు.
Similar News
News December 25, 2024
నితీశ్‌ని తప్పిస్తారా.. అర్థరహితం: గవాస్కర్
మెల్‌బోర్న్‌లో రేపు జరిగే టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డిని తుది జట్టు నుంచి తప్పిస్తారన్న వార్తలపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఆ నిర్ణయం పూర్తిగా అర్థరహితమని మండిపడ్డారు. ‘నితీశ్‌ను డ్రాప్ చేయలేం. అతడు జట్టుకు నాలుగో బౌలర్. మంచి బ్యాటర్ కూడా. అతడిని తప్పించకూడదు. అదే విధంగా గత మ్యాచ్‌లో ఫాలో ఆన్ గండం తప్పించిన ఆకాశ్ దీప్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కాల్సిందే’ అని తేల్చిచెప్పారు.
News December 25, 2024
తిరుమల మెట్లపై 12 అడుగుల కొండచిలువ.. భయంతో భక్తుల పరుగులు
సాధారణంగా చిన్నపామును చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది 12 అడుగుల కొండచిలువను చూసి తిరుమల భక్తులు పరుగులు తీశారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమల మెట్ల మార్గంలో పెద్ద కొండచిలువ భక్తుల కంటపడింది. దీంతో వెంటనే టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఆ సర్పాన్ని సేఫ్‌గా అడవిలో వదిలిపెట్టారు. తిరుమలేశుడి నెలవైన శేషాచలం అడవుల్లో ఎన్నో జీవరాశులున్నాయి.
News December 25, 2024
నితీశ్, నవీన్‌కు భారతరత్న దక్కాలి: కేంద్రమంత్రి
భారతరత్న పురస్కారానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అర్హులని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘వారిద్దరూ తమ రాష్ట్రాల్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలకు ఎంతో సేవ చేశారు. వారికి భారతరత్న వంటి అవార్డులు దక్కడం సముచితం. బిహార్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలో మళ్లీ ఎన్డీయే సర్కారే వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.