News December 24, 2024
ఇందిరమ్మ ఇళ్లపై BIG UPDATE
TG: సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించామని, నిన్నటి వరకు 32 లక్షల దరఖాస్తులు పరిశీలించామన్నారు. తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం ఇస్తామన్నారు. రేషన్‌కార్డులతో సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తాయన్నారు.
Similar News
News January 22, 2025
కృష్ణ జన్మభూమి కేసు: స్టే పొడిగించిన సుప్రీంకోర్టు
మథురలో షాహీ ఈద్గాను కోర్టు కమిషనర్ తనిఖీ చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆర్డర్‌పై తాత్కాలిక స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. 2025, ఏప్రిల్ 1కి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. కృష్ణ జన్మస్థానమైన ఇక్కడి మందిరాన్ని ఔరంగజేబు కూల్చేసి ఈద్గా నిర్మించాడన్నది చరిత్ర. ఇక్కడ పూజచేసుకొనే హక్కు కల్పించాలని హిందూ సంఘాలు స్థానిక కోర్టుకెళ్లడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
News January 22, 2025
CHAMPIONS TROPHY: పాకిస్థాన్‌కు మరో షాక్?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఓపెనింగ్ సెర్మనీ పాకిస్థాన్ ఆవల జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రెస్ కాన్ఫరెన్స్, కెప్టెన్ల ఫొటో షూట్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లడం లేదని సమాచారం. రోహిత్ కోసమే ఓపెనింగ్ సెర్మనీ వేదిక మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా స్టేడియాల మరమ్మతులు ఇంకా ఫినిష్ చేయలేక పాక్ కిందా మీదా పడుతోంది.
News January 22, 2025
భార్యతో సెల్ఫీ ఎంత పని చేసింది
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందిన విషయం తెలిసిందే. భార్యతో దిగిన సెల్ఫీనే తన మరణానికి దారితీస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. చలపతి భార్య అరుణ కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. 2016లో వారిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఫోన్ పోలీసులకు చిక్కింది. దీని ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేశారు. పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడి చేయడంతో చలపతి సహా 27 మంది మావోలు చనిపోయారు.