News December 25, 2024
అల్పపీడనం ఎఫెక్ట్.. వర్షాలతో భారీ నష్టం
అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 2 రోజులుగా కురుస్తున్న జల్లులతో కోతకొచ్చిన పంటతో పాటు ధాన్యం నీటి పాలైనట్లు రైతులు వాపోయారు. అటు TGలోని భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలం, ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో ధాన్యం నీటి పాలైందని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
Similar News
News December 26, 2024
సినీ పెద్దలకు సీఎం రేవంత్ షాక్
TG: మూవీ ఇండస్ట్రీకి కీలకమైన బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై సినీ ప్రముఖులకు నిరాశే ఎదురైంది. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. CM నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు నిరాశ చెందినట్లు సమాచారం. రూ.వందల కోట్లతో తెరకెక్కిన సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోవడం పెద్ద దెబ్బేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News December 26, 2024
వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేం: సీఎం
TG: తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేమన్నారు. తనకు ప్రత్యేకంగా ఎలాంటి రాగద్వేషాలు లేవని చెప్పారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం సహకరిస్తుందని, అదే సమయంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. చిత్ర పరిశ్రమ రాజకీయాలను దూరం పెట్టాలని సూచించారు.
News December 26, 2024
బాక్సింగ్ డే టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట
బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి AUS 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఆసీస్ టాపార్డర్‌లో నలుగురు బ్యాటర్లు అర్ధసెంచరీలు చేశారు. స్మిత్(68*), కమిన్స్(8*) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3, ఆకాశ్ దీప్, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. తొలి రోజే 87,242 మంది అభిమానులు హాజరయ్యారని, ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికమని క్రీడా వర్గాలు తెలిపాయి.