News December 25, 2024
రేపు సీఎం రేవంత్‌ను కలుస్తాం: దిల్ రాజు

టాలీవుడ్ డైరెక్టర్లు, నిర్మాతలు అందరం కలిసి రేపు సీఎం రేవంత్‌ను కలుస్తామని FDC ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. అల్లు అరవింద్‌తోపాటు వెళ్లి కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతోంది. వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి రూ.2కోట్లు రేవతి కుటుంబానికి అందిస్తున్నారు’ అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.
Similar News
News January 20, 2026
రేపు మట్టపల్లికి గవర్నర్ రాక..

మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రోటోకాల్ పాటిస్తూనే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆలయ పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు.
News January 20, 2026
తినేటప్పుడు మాట్లాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా!

ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడితే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి ద్వారా అధికంగా గాలి పొట్టలోకి చేరి తేన్పులు, గ్యాస్ సమస్యలు రావొచ్చు. ఒక్కోసారి అన్నవాహికలోకి కాకుండా గాలి వెళ్లే గొట్టంలోకి ఆహారం వెళ్లి గొంతునొప్పి, తీవ్రమైన దగ్గు వస్తుంది. ఎక్కువగా తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. సరిగ్గా నమలకపోవడంతో జీర్ణరసాలు ఆహారంలో కలవక అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.
News January 20, 2026
స్థలం చిన్నదైనా ఇంకుడు గుంత తవ్వాలా?

స్థలం చిన్నదైనా వాస్తు నియమాలు పాటిస్తూ కనీస సౌకర్యాలు కల్పించుకోవడం సాధ్యమే అంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. నీటి వసతి కోసం నిర్మించే సంపు, ఇంకుడు గుంతలను ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. ‘అవసరమైతే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యమైన నిర్మాణానికి ఆటంకం కలగకుండా, ఉన్న స్థలంలోనే శాస్త్రీయంగా వీటిని నిర్మించుకోవడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


