News December 25, 2024

భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అటు ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Similar News

News December 26, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో రేపు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

News December 26, 2024

పాక్‌పై యుద్ధానికి 15వేలమంది తాలిబన్లు

image

తూర్పు అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని అక్కడి తాలిబన్ సర్కారు తేల్చిచెప్పింది. కాబూల్ నుంచి పాక్ సరిహద్దుల్లోకి 15వేలమంది తాలిబన్ ఫైటర్లను తరలిస్తున్నట్లు ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్‌లో వారి అనుబంధ సంస్థ టీటీపీ ఉగ్రదాడులు పెంచింది. ఈ నేపథ్యంలోనే పాక్, అఫ్గాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి.

News December 26, 2024

రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1,705 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 21 రోజుల్లోనే రూ.1705 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. హిందీలోనే ఈ చిత్రం 700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క ముంబైలోనే రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు చేసింది.