News December 25, 2024

భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అటు ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Similar News

News January 17, 2025

పంచాయతీ కార్యదర్శులకు షాక్!

image

TG: నల్గొండ(D)లో అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరైన 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసును జిల్లా కలెక్టర్ బ్రేక్ చేశారు. దీంతో గైర్హాజరైన కాలానికి సంబంధించిన సర్వీసును వారు కోల్పోనున్నారు. దీని వల్ల సర్వీస్ రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల విషయంలో వారికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వీరిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. పాత స్థానాల్లో కాకుండా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు.

News January 17, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.650 పెరిగి రూ.81,270కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.74,500 పలుకుతోంది. కేజీ వెండి రూ.1000 పెరిగి రూ.1,04,000కు చేరింది.

News January 17, 2025

బీదర్ దొంగల కోసం కొనసాగుతున్న పోలీసుల వేట

image

<<15173290>>బీదర్ దొంగల కోసం<<>> పోలీసులు వేట కొనసాగుతోంది. నిందితులను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారు హైదరాబాద్ నుంచి అడ్డదారుల్లో రాయ్‌పూర్‌కు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. నిన్న బీదర్‌లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి ఏటీఎం డబ్బులు దొంగిలించిన నిందితులు సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. అఫ్జల్ గంజ్‌లో ట్రావెల్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పరారయ్యారు.