News March 16, 2024

బీఎస్పీని వీడుతున్నా: RS ప్రవీణ్ కుమార్

image

TG: BSP రాష్ట్రాధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. బహుజన్ సమాజ్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ‘నిన్న బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రక పొత్తును భగ్నం చేయాలని ప్రయత్నాలు(కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. చివరివరకు బహుజన వాదాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 22, 2024

BGT: తొలి సెషన్‌ ఆసీస్‌దే

image

భారత్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఫస్ట్ డే తొలి సెషన్‌లో పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బ్యాటర్లు ఆసీస్ బౌలింగ్‌కు బెంబేలెత్తారు. కనీసం బాల్‌ను టచ్ చేయడానికే కష్టపడ్డారు. దీంతో జైస్వాల్, పడిక్కల్ డకౌట్ అయ్యారు. కోహ్లీ 5 రన్స్‌తో నిరాశపరిచారు. రాహుల్ కాస్త మెరుగ్గా ఆడినా చివరికి 26 రన్స్ వద్ద వెనుదిరిగారు. దీంతో ఫస్ట్ సెషన్ ముగిసేసరికి IND 51రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది.

News November 22, 2024

STOCK MARKETS: భారీ లాభాల్లోనే..

image

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడమే ఇందుకు కారణం. నిఫ్టీ 23,458 (+107), సెన్సెక్స్ 77,548 (+390) వద్ద ట్రేడవుతున్నాయి. ఆరంభ లాభాలతో పోలిస్తే కాస్త తగ్గాయి. మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. రియాల్టి, PSU బ్యాంక్ షేర్లు పుంజుకున్నాయి. ADANIENT, ADANI PORTS, M&M, AXIS BANK, HEROMOTO టాప్ లూజర్స్.

News November 22, 2024

47/4.. పీకల్లోతు కష్టాల్లో భారత్

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రాహుల్(26) స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ రూపంలో ఔటయ్యారు. జైస్వాల్(0), పడిక్కల్(0), కోహ్లీ (5) విఫలమయ్యారు. క్రీజులో పంత్(10), జురెల్(0) ఉన్నారు.