News March 16, 2024
బీఎస్పీని వీడుతున్నా: RS ప్రవీణ్ కుమార్
TG: BSP రాష్ట్రాధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. బహుజన్ సమాజ్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ‘నిన్న బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రక పొత్తును భగ్నం చేయాలని ప్రయత్నాలు(కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. చివరివరకు బహుజన వాదాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 7, 2024
VIRAL: హైదరాబాద్ గొప్పతనం ఇదే!
పొట్టకూటి కోసం తరలివచ్చిన ఎంతో మందికి హైదరాబాద్ అండగా నిలిచిందని తెలిపే ఓ ఫొటో వైరలవుతోంది. ‘బతకడమే వేస్ట్ అనుకున్న నాకు.. హైదరాబాద్ ఎలా బతకాలో నేర్పింది’ అని ఓ వ్యక్తి తన ఆటో వెనుక రాసుకున్నారు. దీనిని ఓ వ్యక్తి ఫొటో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఉపాధి కోసం వస్తే అమ్మలా కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని నెటిజన్లు కితాబిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు HYDలో ఉపాధి పొందుతున్నారు.
News October 7, 2024
DMK vs పవన్ కళ్యాణ్
డీఎంకే, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇటీవల తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం, ఉదయనిధి స్టాలిన్‌కు కౌంటర్ వేయడంపై డీఎంకే ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. బీజేపీ, అన్నాడీఎంకే కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు పవన్‌పై అడ్వకేటుతో ఫిర్యాదు చేయించడం, ప్రకాశ్ రాజ్‌తో ట్వీట్లు పెట్టించడం DMK పనేనని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
News October 7, 2024
రూ.14వేల ఇసుక రూ.21వేలకు చేరింది: బొత్స
AP: రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పని లేక కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ హయాంలో విశాఖలో 10 టన్నుల ఇసుక రూ.14వేలకు దొరికేదని, ప్రస్తుతం అది రూ.21వేలకు చేరిందని విమర్శించారు. కూటమి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఫైరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు, పవన్ ఆపాలని డిమాండ్ చేశారు.