News March 16, 2024
శ్రీకాకుళం: అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. ఒడిశా సరిహద్దు వెంబడి దాదాపు 112 కి.మీ మేర శ్రీకాకుళం జిల్లా ఉందని, ఇరు రాష్ట్రాల మధ్య జిల్లా వెంబడి 52 రహదారుల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయని వీటిలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా నిరంతరం పెట్రోలింగ్ బృందాలు తిరుగుతున్నాయని అన్నారు.
Similar News
News April 7, 2025
మడపాం: వంశధార నదిలో జారిపడి మత్స్యకారుడు మృతి

నరసన్నపేట మండలం మడపాం వద్ద వంశధార నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మత్స్యకారుడు మృతి చెందాడు. సోమవారం ఉదయం చేపల వేట కోసం వెళ్లిన వాడ అంజలి అప్పన్న నదిలో వల విసరగా పెద్ద బండరాయి వలకు తగిలింది. చేపలు పడి ఉంటాయని గట్టిగా లాగడంతో జారిపడి మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 7, 2025
రాములోరి సేవలో కేంద్రమంత్రి రామ్మోహన్

శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లి శ్రీశైన వీధిలో ఉన్న శ్రీ రామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని రాములోరికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శ్రీకాకుళం MLA గొండు శంకర్ హాజరయ్యారు. వేద పండితులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో కేంద్రమంత్రికి, శాసనసభ్యులకు స్వాగతం పలికారు.
News April 6, 2025
త్రిపురాన విజయ్‌తో ముచ్చటించిన ధోనీ

టెక్కలికి చెందిన యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ త్రిపురాన విజయ్‌తో ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్లేయర్ ధోనీ ముచ్చటించారు. చపాక్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ధోనీని విజయ్ కలిశారు. ఈ సందర్భంగా మొదటిసారి ఐపీఎల్‌కు ఎంపికైన విజయ్‌ను ధోనీ అభినందించారు.