News March 16, 2024
శ్రీకాకుళం: అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. ఒడిశా సరిహద్దు వెంబడి దాదాపు 112 కి.మీ మేర శ్రీకాకుళం జిల్లా ఉందని, ఇరు రాష్ట్రాల మధ్య జిల్లా వెంబడి 52 రహదారుల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయని వీటిలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా నిరంతరం పెట్రోలింగ్ బృందాలు తిరుగుతున్నాయని అన్నారు.
Similar News
News December 10, 2024
మందస వద్ద పులి అడుగు జాడలు
పలాస నియోజకవర్గం మందస మండలం చీపి ప్రాంతంలో పులి అడుగు జాడలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ఈ అడుగులు ఉన్నట్లు గమనించారు. ఇటీవలే ఒడిశా ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దుల్లోకి పులి ప్రవేశించిందంటూ ఒడిశా అధికారులు, స్థానిక అధికారులు సమాచారం అందించారు. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
News December 10, 2024
శ్రీకాకుళం: నిలిచిపోయిన పనులు ప్రారభించండి: విజయ
ఇచ్ఛాపురం నియోజకవర్గ సమస్యలపై శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ కలెక్టరుకు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను కలిసి లేఖను అందజేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో గత ప్రభుత్వ హయాంలో వివిధ వంతెనలను ప్రతిపాదించి సాంకేతిక అనుమతులు, పరిపాలన, ఆర్థిక అనుమతుల మంజూరు చేసి టెండర్లను కూడా పిలిచామని ఆ పనులను ప్రారంభించాలని అభ్యర్థించారు.
News December 9, 2024
నరసన్నపేట- ఇచ్ఛాపురం హైవేను 6 లైన్లకు విస్తరించాలి
రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగమయ్యేలా స్థానిక జిల్లా మీదుగా ఉన్న జాతీయ రహదారి -16ను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దీనికి అనుగుణంగా నరసన్నపేట – ఇచ్ఛాపురం మధ్య ఉన్న జాతీయ రహదారిని 6 లైన్లకు విస్తరించాలని హైవే అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు.