News March 16, 2024
ఏలూరు: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.
Similar News
News March 4, 2026
ఏపీ జేఏసీ జిల్లా జాయింట్ సెక్రటరీగా సీహెచ్ చలం ఎన్నిక

ఏపీ జేఏసీ పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్. చలం ఎన్నికయ్యారు. భీమవరంలో నిర్వహించిన సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చలం మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలని, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
News March 4, 2026
ప.గో: YCP కొత్త కోఆర్డినేటర్ ఈయనే..!

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అమర్నాథ్ నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 4, 2026
రెవెన్యూ క్లినిక్‌లతో భూ సమస్యలకు చెక్: ప.గో కలెక్టర్

పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతోందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి కోరారు. కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అందిన 420 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 97 పరిష్కరించామని, 29 తిరస్కరించామని తెలిపారు. మిగిలిన 294 దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


