News March 16, 2024

ఏలూరు: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

image

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.

Similar News

News December 9, 2025

భూ సర్వే రోవర్‌లను సిద్ధం చేయాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రోవర్స్ పనితీరును మంగళవారం పరిశీలించారు. జిల్లాలో మొత్తం 114 రోవర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిలో 42 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. మిగిలిన వాటిలో కొన్ని రీఛార్జి చేయవలసి ఉండగా, మరికొన్ని రిపేర్లు చేయవలసినవి ఉన్నాయని సంబంధిత అధికారులు జేసీకి వివరించారు. రోవర్లకు రీఛార్జ్ చేసుకొని, రిపేర్లు ఉంటే చూసుకోవాలని జేసీ సూచించారు.

News December 9, 2025

ప.గో జిల్లా ప్రజలారా.. ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి

image

ఉమ్మడి ప.గో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ఏసీబీ డీఎస్పీ 9440446157, సీఐలు 9440446158, 9440446159, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయవచ్చాన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. (నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినం)

News December 9, 2025

ఈ కమిషనర్ మాకొద్దు: నరసాపురం కౌన్సిల్ ఫిర్యాదు

image

నరసాపురం మున్సిపల్ కమిషనర్ అంజయ్యను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మునిసిపల్ చైర్‌పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణతో పాటు వైసీపీ కౌన్సిల్ సభ్యులు జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి PGRSలో ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనులకు కౌన్సిల్ తీర్మానం చేసినా పట్టించుకోవట్లేదని, అవినీతి ఆరోపణలు వంటి కారణాల వల్ల ఆయనను సరెండర్ చేయాలని కౌన్సిల్ తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని జేసీకి అందించారు.