News December 26, 2024

నక్కపల్లికి మరో ఫార్మా సెజ్: సీఎం రమేశ్

image

AP: విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కొత్తగా ఫార్మా సెజ్ ఏర్పాటుకానుందని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. జనవరి 9న ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. సుమారు 1800 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిపై కేంద్రం సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. అలాగే పూడిమడక వద్ద రూ.75వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

Similar News

News December 27, 2024

వర్చువల్‌గా విచారణకు అల్లు అర్జున్

image

TG: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు అనుమతించింది. తొక్కిసలాట కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు రిమాండ్ విధించినా AA మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కోర్టుకు చేరుకున్నారు.

News December 27, 2024

ఇద్దరు మహానుభావులను కోల్పోయాం

image

మాజీ ప్రధాని, ఆధునిక భారత పితామహుడిగా పేరొందిన మన్మోహన్ సింగ్‌ను కోల్పోవడం దేశానికి తీరనిలోటు అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మరణించడంతో ఇద్దరు మహానుభావులను కోల్పోయామంటూ ఆవేదన చెందుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు.

News December 27, 2024

డెడ్ బాడీ పార్శిల్.. మిస్టరీ వీడింది

image

AP: ప.గో జిల్లా యండగండిలో డెడ్ బాడీ పార్శిల్ కేసు కొలిక్కి వచ్చింది. వదిన ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ వర్మ ఓ అమాయకుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శవం పేరుతో వదిన తులసిని భయపెట్టాలని చూసిన శ్రీధర్.. ఎవరూ లేని బర్రె పర్లయ్యను చంపేశాడని తెలిపారు. డెడ్ బాడీని పార్శిల్ చేసి అదే రోజు ఆస్తి పత్రాలపై సంతకాలు సేకరించే ప్రయత్నం చేశాడు. వర్మతో పాటు భార్యలు రేవతి, సుష్మను పోలీసులు అరెస్టు చేశారు.