News December 27, 2024
రోహిత్ శర్మ రిటైర్ అవుతారా?
భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఫామ్‌లేమితో ఆయన ఇబ్బందిపడుతున్నారు. ఆసీస్‌తో BGT సిరీస్‌లో ఇంతవరకు అతడు ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 3 పరుగులకే ఔట్ కావడంతో అతడి ఆటతీరుపై ఫ్యాన్స్‌లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో కెప్టెన్సీని ఇతరులకు రోహిత్ అప్పగించాలని, లేదంటే టెస్టులకు వీడ్కోలు పలకాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Similar News
News December 29, 2024
విరాట్‌తో నితీశ్ కుటుంబం ఫొటో
నితీశ్ కుమార్ రెడ్డి విరాట్ కోహ్లీకి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. నిన్న సెంచరీతో చెలరేగిన అతడికి విరాట్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. నితీశ్ కుటుంబంతో కలిసి ఫొటో దిగారు. అభిమానించే స్థాయి నుంచి ఆ అభిమాన ఆటగాడి చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకుని, బ్యాటింగ్‌లో చెలరేగుతున్న నితీశ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మున్ముందు నితీశ్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత పైన ఆడించాలని రవిశాస్త్రి సూచించారు.
News December 29, 2024
AUSvsIND: భారత్ ఆలౌట్
మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న రాత్రి సెంచరీతో నాటౌట్‌గా ఉన్న నితీశ్, వేగంగా పరుగులు చేసే క్రమంలో లయన్ బౌలింగ్‌లో 114 పరుగులకు ఔటయ్యారు. ఆస్ట్రేలియాకు 105 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయన్‌కు తలో 3 వికెట్లు దక్కాయి.
News December 29, 2024
వచ్చే నెల 20న దావోస్‌కు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ వచ్చే నెల 20న దావోస్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సులో ఆయన, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల్ని తీసుకురావడమే ఈ పర్యటన లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సదస్సులో ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి.