News December 27, 2024

రోహిత్ శర్మ రిటైర్ అవుతారా?

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఫామ్‌లేమితో ఆయన ఇబ్బందిపడుతున్నారు. ఆసీస్‌తో BGT సిరీస్‌లో ఇంతవరకు అతడు ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 3 పరుగులకే ఔట్ కావడంతో అతడి ఆటతీరుపై ఫ్యాన్స్‌లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో కెప్టెన్సీని ఇతరులకు రోహిత్ అప్పగించాలని, లేదంటే టెస్టులకు వీడ్కోలు పలకాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Similar News

News January 17, 2025

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్

image

AP: రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. రేపు కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 12 నెలలకు 12 థీమ్‌లతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు.

News January 17, 2025

రీఛార్జ్ చేసుకునే వారికి GOOD NEWS

image

దేశంలోని 15 కోట్ల 2G యూజర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. వాయిస్ కాల్స్, SMS వంటి బేసిక్ సర్వీసులు మాత్రమే అవసరమయ్యే వీరి కోసం రూ.10తో రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. దీంతో ఇంటర్నెట్ అవసరం లేని వారు భారీ మొత్తంతో రీఛార్జ్ చేసుకునే తిప్పలు తప్పుతాయి. అలాగే స్పెషల్ టారిఫ్ వోచర్ (STV)ల వ్యాలిడిటీ 90 రోజులు ఉండగా తాజాగా 365 రోజులకు పెంచింది.

News January 17, 2025

3.5 కోట్ల పని దినాలు కల్పించండి.. కేంద్రానికి లేఖ

image

AP: ఉపాధి హామీ పని దినాలు పూర్తి కావొస్తుండటంతో అదనంగా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం 21.50 కోట్ల పనిదినాలు కేటాయించగా 20.45 కోట్ల పని దినాలు పూర్తి చేశారు. దీంతో మరో 3.5 కోట్ల పనిదినాలు కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.