News December 28, 2024

ED ఆఫీసుపై CBI రైడ్‌.. అది కూడా లంచం కేసు

image

లంచం కేసులో ED ఆఫీసుపై CBI రైడ్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. సిమ్లా ED ఆఫీసులో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ విశాల్ దీప్ ఓ కేసులో ప్రైవేటు వ్య‌క్తి నుంచి ₹55 ల‌క్ష‌లు డిమాండ్ చేశారు. దీంతో CBI రంగంలోకి దిగింది. విశాల్‌ తప్పించుకోగా అతని తమ్ముడు దొరికిపోయాడు. లంచం డబ్బు ₹55 ల‌క్ష‌ల‌తోపాటు విశాల్ ఆఫీసులో మ‌రో ₹56 ల‌క్ష‌ల న‌గ‌దును CBI సీజ్ చేసింది. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది.

Similar News

News December 29, 2024

వచ్చే నెల 20న దావోస్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ వచ్చే నెల 20న దావోస్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సులో ఆయన, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల్ని తీసుకురావడమే ఈ పర్యటన లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సదస్సులో ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి.

News December 29, 2024

పేర్ని నానిపై ఎటువంటి కక్ష లేదు: నాదెండ్ల

image

వైసీపీ నేత పేర్ని నానిపై తమకు ఎలాంటి కక్షా లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘కుట్రలు చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. తప్పు చేయకపోతే నాని జరిమానా ఎందుకు కట్టారు? ఆ గోడౌన్‌ను తన భార్య పేరుతో ఎందుకు తీసుకున్నారు? ఎవరి పేరిట ఉంటే వారిపైనే కేసులు నమోదవుతాయి. గిడ్డంగుల తనిఖీల అనంతరం నోటీసులిచ్చినా నాని ఎప్పుడూ స్పందించలేదు. YSRCP ఐదేళ్లపాటు అరాచకపాలన సాగించింది’ అని విమర్శించారు.

News December 29, 2024

పెళ్లిలో విందు బాలేదని గొడవ.. ఆ వెంటనే వరుడికి మరో పెళ్లి!

image

యూపీలోని చందౌలీ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. మెహతాబ్ అనే వరుడికి 7నెలల క్రితం స్థానిక యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి రోజున అతడి కుటుంబీకులు విందు విషయంలో ఆడపెళ్లివారితో గొడవపడ్డారు. ఎంత నచ్చచెప్పినా వినకుండా పెళ్లి ఆపేశారు. ఆ రాత్రే మెహతాజ్ వేరే అమ్మాయిని రహస్యంగా పెళ్లాడాడు. దీంతో పెళ్లి రద్దుకోసం అతడి కుటుంబీకులు డ్రామా ఆడి తమను మోసం చేశారని ఆడపెళ్లివారు పోలీసుల్ని ఆశ్రయించారు.