News December 28, 2024
ED ఆఫీసుపై CBI రైడ్.. అది కూడా లంచం కేసు

లంచం కేసులో ED ఆఫీసుపై CBI రైడ్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. సిమ్లా ED ఆఫీసులో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ దీప్ ఓ కేసులో ప్రైవేటు వ్యక్తి నుంచి ₹55 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో CBI రంగంలోకి దిగింది. విశాల్ తప్పించుకోగా అతని తమ్ముడు దొరికిపోయాడు. లంచం డబ్బు ₹55 లక్షలతోపాటు విశాల్ ఆఫీసులో మరో ₹56 లక్షల నగదును CBI సీజ్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.
Similar News
News April 14, 2026
DANGER: వేసవిలో ఇవి తింటే..

సమ్మర్‌లో అధిక నూనె ఉండే బజ్జీలు, పకోడీలు, చిప్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల అలసట, ఎసిడిటీ వస్తాయని, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. అలాగే స్వీట్లు, ప్యాకేజ్డ్ జ్యూసులు, షుగర్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ తాగొద్దని, వీటి వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచించారు.
News April 14, 2026
ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

AP: కడప(D) ఒంటిమిట్టలో ఇవాళ 45°C ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల(D) సంజామల 44.2°C, తిరుపతి(D) వరదయ్యపాలెంలో 43.8°C ఉష్ణోగ్రత నెలకొంది. 262 మండలాల్లో 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు SDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.



