News March 16, 2024
ఎల్లుండి బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్?

బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎల్లుండి బీఆర్ఎస్లోకి చేరనున్నారని తెలుస్తోంది. బహుజన్ సమాజ్ పార్టీకి ఆయన ఈరోజు ఉదయం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ప్రవీణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చర్చల అనంతరం నాగర్ కర్నూల్ స్థానాన్ని ఆయనకు ఇచ్చేందుకు కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News April 7, 2025
STOCK MARKETS: రూ.19 లక్షల కోట్ల నష్టం!

భారత స్టాక్ మార్కెట్స్ సెషన్ ప్రారంభంలోనే సుమారు రూ.19 లక్షల కోట్లు కోల్పోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 3939, నిఫ్టీ 1160 పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి. 2020 మార్చి తర్వాత ఇదే అత్యల్పం. మొత్తంగా 5 శాతానికి పైగా సంపద ఆవిరైంది. ఐటీ, మెటల్ సూచీలు 7 శాతం నష్టపోయాయి. మరోవైపు చైనా, జపాన్, కొరియా తదితర దేశాల మార్కెట్లు సైతం కుప్పకూలాయి.
News April 7, 2025
మూడు రోజుల్లో ₹3000 తగ్గిన బంగారం ధరలు!

అమెరికా విధించిన సుంకాలతో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ కూడా స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹280 తగ్గి ₹90,380కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹250 తగ్గి ₹82,850గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,02,900కి చేరింది. కాగా, గత మూడు రోజుల్లోనే కేజీ వెండిపై రూ.9,100, తులం బంగారంపై రూ.3000 తగ్గడం విశేషం.
News April 7, 2025
వాట్సాప్ యూజర్లకు అలర్ట్

ఆన్లైన్ మోసాల పట్ల వాట్సాప్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నంబర్కి OTP పంపి, అనుకోకుండా పంపామని మోసగాళ్లు వాట్సాప్లో చాట్ చేస్తున్నారని తెలిపారు. వాట్సాప్ను హ్యాక్ చేసి సన్నిహితుల నంబర్లకు మీ పేరుతో డబ్బులు పంపించాలంటూ సందేశాలతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలన్నారు.