News March 16, 2024

ఎల్లుండి బీఆర్ఎస్‌లోకి ప్రవీణ్ కుమార్?

image

బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎల్లుండి బీఆర్ఎస్‌లోకి చేరనున్నారని తెలుస్తోంది. బహుజన్ సమాజ్ పార్టీకి ఆయన ఈరోజు ఉదయం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రవీణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చర్చల అనంతరం నాగర్ కర్నూల్ స్థానాన్ని ఆయనకు ఇచ్చేందుకు కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News February 12, 2026

ఉప్పుతో పిల్లలకు ముప్పు.. తస్మాత్ జాగ్రత్త!

image

చిన్న పిల్లల ఆహారంలో అదనంగా ఉప్పు చేర్చడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఏడాదిలోపు పిల్లల కిడ్నీలు సున్నితంగా ఉండటం వల్ల ఉప్పును తట్టుకోలేవు. తల్లి పాలతో పాటు సహజ ఆహారంలో ఉండే సోడియం వారికి సరిపోతుంది. చిన్నప్పుడే ఉప్పు అలవాటు చేస్తే పెద్దయ్యాక BP, గుండె సమస్యలు రావొచ్చు. చిరుతిళ్లకు బదులు పండ్లు, కూరగాయలు అలవాటు చేస్తూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ అని సూచిస్తున్నారు.

News February 12, 2026

ఢిల్లీలో TG CM రేవంత్ మీడియా చిట్ చాట్

image

* ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది నా వ్యక్తిగత డిమాండ్.. ఆయన జాతి సంపద
* ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలి
* ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు ఆధారాలేవీ తగలబడలేదు
* శంషాబాద్ ఎయిర్‌పోర్టు పక్కన బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మించాలని కేంద్రాన్ని కోరా.. అందుకు 600 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం.

News February 12, 2026

ఇషాన్ విధ్వంసం.. వరుసగా 6, 6, 6, 6, 4

image

టీ20 WCలో నమీబియాతో మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశారు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. స్మిత్ వేసిన ఆరో ఓవర్లో ఇషాన్ వరుసగా 6, 6, 6, 6, 4 బాదారు. 6 ఓవర్లకు భారత్ స్కోర్ 86-1.