News December 28, 2024
ఘోరం: కుటుంబమంతా ఆత్మహత్య
AP: వైఎస్సార్(D) సింహాద్రిపురం(M) దిద్దేకుంటలో విషాదకర ఘటన జరిగింది. అప్పుల బాధతో ఓ అన్నదాత కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. రైతు నాగేంద్ర(40) చీనీ తోట సాగు చేస్తున్నారు. ఆదాయం లేకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో భార్య వాణి(38), పిల్లలు గాయత్రి(12), భార్గవ్(11)ను తోటకు తీసుకెళ్లి ఉరివేశాడు. అనంతరం తానూ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 29, 2024
ఓటర్లు లక్ష మంది.. ఓటేసింది 2 వేల మందే
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవడంలో చూపిన ఆసక్తిని, ఓటు వేయడంలో చూపలేదు విదేశాల్లో ఉన్న భారతీయులు. గత ఎన్నికల కోసం 1.20 లక్షల మంది ఓవర్‌సీస్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో కేవలం 2,958 మంది మాత్రమే ఓటు వేయడానికి పోలింగ్ రోజు స్వదేశానికి రావడం గమనార్హం. కేరళ నుంచి అత్యధికంగా 89 వేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడించాయి.
News December 29, 2024
భారీగా తగ్గిన ధరలు.. కేజీ రూ.5
AP: పలు ప్రాంతాల్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు హోల్ సేల్ వ్యాపారులకు కేజీ రూ.5కే విక్రయిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు KG రూ.8కి కొనాలన్న మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ రూ.10-15 వరకు పలుకుతోంది. పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు వాపోతుంటే, కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News December 29, 2024
విభజన రాజకీయాలు ప్రమాదం: SC న్యాయమూర్తి
మతం, కులం, జాతి ఆధారిత విద్వేష వ్యాఖ్యలు దేశ ఐక్యతా భావాలకు పెను సవాల్ విసురుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో ఓ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు చేసే ఈ రకమైన రాజకీయం సమాజంలో విభజనను పెంచుతుందన్నారు. విభజన సిద్ధాంతాలు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, సామాజిక అన్యాయం సోదర భావానికి ప్రమాదమన్నారు.