News December 28, 2024
నిజామాబాద్ పొలిటికల్ రౌండప్ @2024
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీకి 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలకు 4 స్థానాలకు కైవసం చేసుకుంది. బీజేపీ 3 చోట్ల గెలుపొందిందగా బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించింది. కాగా జిల్లాకు చెందిన మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ పదవీ వరించింది. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ, బీఆర్ఎస్ తమ వంతు ప్రయత్నం చేస్తోంది. దీనిపై మీ కామెంట్
Similar News
News December 29, 2024
NZB: రేపు Jr. కళాశాలల ప్రిన్సిపాల్లతో కలెక్టర్ సమన్వయ సమావేశం
నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్లతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఇంటర్ విద్యా అధికారి (DIEO) రవికుమార్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మానసిక సంసిద్ధతను పెంపొందించేందుక, విద్యార్థుల్లో ఆంటీ డ్రగ్స్, ఆత్మహత్యల నిరోధించేందుకు తదితర అంశాలపై సమీక్ష జరుపనున్నారని, అందరూ హాజరుకావాలని ఆయన సూచించారు.
News December 29, 2024
ఆర్మూర్: గుండెపోటుతో వ్యవసాయ కూలీ మృతి
గుండెపోటుతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మిర్దాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆర్మూర్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం కందుర్తికి చెందిన ఓ వ్యవసాయ కూలీ మిర్దాపల్లిలో పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పొలం గట్టుపై పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
News December 29, 2024
డిచ్పల్లి: ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికిన మహిళలు
జైలు నుంచి వచ్చాక తొలి సారిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం డిచ్పల్లికి రాగా అక్కడ మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. హారతులిచ్చి తిలకందిద్దారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, విజి గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.