News December 28, 2024
ఉదయపు పలకరింపై, ఊరు ప్రశ్నించే గొంతుకై

Way2News.. తొమ్మిదేళ్ల క్రితం వేల మంది యూజర్లతో ప్రారంభమై నేడు కోట్లాది తెలుగు వారికి చేరువైంది. ఉదయమే అందరికీ పలకరింపుగా, ప్రతి ఊరు తరఫున ప్రశ్నించే గొంతుగా మారడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ప్రజలకు వేగంగా, సులువుగా సమాచారం అందించాలనే మా ఆశయానికి మీ ఆశీర్వాదం తోడవడంతోనే ఈ విజయయాత్ర సాధ్యమైంది. మనమంతా వార్తా ప్రపంచంలో కొత్త గమ్యాలు చేరేందుకు ఇలాగే సహకరిస్తారని ఆశిస్తూ.. కృతజ్ఞతలు!
-Team Way2News
Similar News
News September 24, 2025
శివపార్వతుల కథ: కాశీ అన్నపూర్ణావతారం

ఓసారి శివుడు అన్నంతో సహా అన్నీ మాయేనని అంటాడు. ఈ మాటలు నచ్చక పార్వతీ దేవి కాశీని విడిచి వెళ్లగా ప్రపంచంలో ఆహారం దొరకక ప్రజలు ఆకలితో అలమటిస్తారు. ప్రజల కష్టాలు చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలి తీరుస్తారు. అప్పుడు ఆహారం ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు భిక్షాపాత్ర పట్టుకుని పార్వతి వద్దకు వెళ్లి భిక్ష అడుగుతాడు. అప్పటి నుంచి పార్వతీ దేవి అన్నపూర్ణగా కాశీలో కొలువై భక్తుల ఆకలిని తీరుస్తోంది.
News September 24, 2025
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో దర్భ వైభవం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా నిర్వహించే ధ్వజారోహణంలో దర్భ చాప, తాడు చాలా కీలకం. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భ వేదోక్త శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనది. వాతావరణ శుద్ధికి దోహదపడే దర్భ శుభ ఫలితాలు ఇస్తుందని యజుర్వేదం పేర్కొంది. దర్భ వినియోగం దైవిక వరంగా భావిస్తారు.
News September 24, 2025
ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ పిటిషన్.. నేడు విచారణ

AP: తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని స్పీకర్ అయ్యన్న, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ముందే నిర్ణయించుకున్నారని జగన్ పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం ఉన్నాయని ఆరోపించారు. సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.