News December 28, 2024
ప్రధాని మోదీని కలిసిన గుకేశ్
వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా గుకేశ్‌కు మోదీ చెస్ బోర్డు కానుకగా అందించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘ప్రధాని మోదీని కలవడం నా జీవితంలోనే అత్యుత్తమమైన క్షణం’ అని గుకేశ్ పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తలైవా రజినీకాంత్‌ను కూడా గుకేశ్ కలిసిన విషయం తెలిసిందే.
Similar News
News January 1, 2025
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
TG: విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్‌ను తగ్గించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. NCERT సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని సైన్స్‌తో పాటు ఇతర సబ్జెక్టుల్లో పాఠాలను కుదించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌లో, 2026-27 నుంచి సెకండియర్‌లో దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కెమిస్ట్రీలో 30%, ఫిజిక్స్‌లో 15%, జువాలజీలో 5-10% వరకు సిలబస్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
News January 1, 2025
ఎల్లుండి నుంచి తెలుగు సమాఖ్య మహాసభలు
హైదరాబాద్ HICCలో జనవరి 3 నుంచి 12వ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరగనున్నాయి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు జాతి వారసత్వ సంపదను భావితరాలకు అందించేలా సమావేశాలు, చర్చలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 3న ఏపీ సీఎం చంద్రబాబు, 5న TG CM రేవంత్‌తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.
News January 1, 2025
భారత్‌కు పెరిగిన సముద్ర తీరం.. కారణమిదే
భారత సముద్ర తీరం 48శాతం మేర పెరిగిందని కేంద్ర హోం శాఖ తాజా నివేదికలో తెలిపింది. 1970 డేటా ప్రకారం తీరం పొడవు 7516 కి.మీ ఉంది. కానీ నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ తాజా విధానాల ప్రకారం ఈసారి వంపుల్ని కూడా లెక్కించారు. దీంతో పొడవు 11,098.81 కి.మీగా అయింది. AP కోస్టల్ ఏరియా పొడవు గతంలో 973.70 కి.మీ ఉండగా అది ఇప్పుడు 1053.07కి చేరింది. అత్యధికంగా గుజరాత్‌కు 92.69శాతం మేర తీరం పొడవు కొత్తగా కలిసింది.