News December 29, 2024

AUSvsIND: భారత్ ఆలౌట్

image

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న రాత్రి సెంచరీతో నాటౌట్‌గా ఉన్న నితీశ్, వేగంగా పరుగులు చేసే క్రమంలో లయన్ బౌలింగ్‌లో 114 పరుగులకు ఔటయ్యారు. ఆస్ట్రేలియాకు 105 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయన్‌కు తలో 3 వికెట్లు దక్కాయి.

Similar News

News January 1, 2025

రోజుకు రూ.48 కోట్ల జీతం.. ఎవరికంటే?

image

ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న భారతీయుడు జగదీప్ సింగ్ అని అన్‌స్టాప్ నివేదిక పేర్కొంది. క్వాంటమ్ స్కేప్ వ్యవస్థాపకుడైన జగదీప్ సింగ్ ఆ కంపెనీ సీఈవోగా ఏడాదికి రూ.17,500 కోట్ల శాలరీ తీసుకుంటున్నట్లు తెలిపింది. అంటే నెలకు రూ.1,458 కోట్లు కాగా రోజుకు రూ.48 కోట్లు. క్వాంటం స్కేప్ స్థాపించక ముందు ఆయన పలు కంపెనీల్లో కీలక పదవుల్లో పనిచేశారు.

News January 1, 2025

టెస్టు ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన నితీశ్

image

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అదరగొడుతున్న తెలుగు తేజం నితీశ్ కుమార్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. తన కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ 528 పాయింట్లకు చేరుకోగా 20 స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకులో నిలిచారు. మరోవైపు ఓపెనర్ జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఈ సిరీస్‌లో విఫలమవుతోన్న విరాట్ 24, రోహిత్ 40వ స్థానానికి పడిపోయారు.

News January 1, 2025

BREAKING: విషాదం.. చిన్నారి చేతన మృతి

image

రాజస్థాన్‌ బోర్ బావి ఘటన విషాదాంతమైంది. 10 రోజులపాటు లోపల నరకం అనుభవించి కొనఊపిరితో ఉన్న చేతన(3)ను <<15040225>>ఇవాళ బయటకు<<>> తీసుకురాగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో పేరెంట్స్, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 23న 150 అడుగుల లోతున్న బోరులో చిన్నారి పడిపోయింది. 10 రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.