News December 29, 2024
AUSvsIND: భారత్ ఆలౌట్
మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న రాత్రి సెంచరీతో నాటౌట్‌గా ఉన్న నితీశ్, వేగంగా పరుగులు చేసే క్రమంలో లయన్ బౌలింగ్‌లో 114 పరుగులకు ఔటయ్యారు. ఆస్ట్రేలియాకు 105 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయన్‌కు తలో 3 వికెట్లు దక్కాయి.
Similar News
News January 17, 2025
రీఛార్జ్ చేసుకునే వారికి GOOD NEWS
దేశంలోని 15 కోట్ల 2G యూజర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. వాయిస్ కాల్స్, SMS వంటి బేసిక్ సర్వీసులు మాత్రమే అవసరమయ్యే వీరి కోసం రూ.10తో రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. దీంతో ఇంటర్నెట్ అవసరం లేని వారు భారీ మొత్తంతో రీఛార్జ్ చేసుకునే తిప్పలు తప్పుతాయి. అలాగే స్పెషల్ టారిఫ్ వోచర్ (STV)ల వ్యాలిడిటీ 90 రోజులు ఉండగా తాజాగా 365 రోజులకు పెంచింది.
News January 17, 2025
3.5 కోట్ల పని దినాలు కల్పించండి.. కేంద్రానికి లేఖ
AP: ఉపాధి హామీ పని దినాలు పూర్తి కావొస్తుండటంతో అదనంగా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం 21.50 కోట్ల పనిదినాలు కేటాయించగా 20.45 కోట్ల పని దినాలు పూర్తి చేశారు. దీంతో మరో 3.5 కోట్ల పనిదినాలు కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
News January 17, 2025
సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీలు
TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దీంతో నేటి నుంచి కాలేజీ విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. మరోవైపు స్కూళ్లకు సెలవులు నేటితో ముగియనుండటంతో రేపు పాఠశాలలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఆదివారం వరకు సెలవులు పొడిగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అటు ఏపీలో స్కూళ్లు 20న పునః ప్రారంభం కానున్నాయి.