News December 29, 2024

ICC అవార్డు.. నామినేట్ అయింది వీరే!

image

ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కోసం ఐసీసీ నలుగురిని నామినేట్ చేసింది. అందులో భారత్ నుంచి అర్ష్‌దీప్ సింగ్, ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్, పాకిస్థాన్ నుంచి బాబర్ ఆజమ్, జింబాబ్వే నుంచి సికందర్ రజాకు చోటు దక్కింది. ఈ నలుగురిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వస్తుంది. ఓటు వేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 4, 2025

బుమ్రాను రెచ్చగొట్టడం ప్రమాదం: మార్క్ వా

image

జస్ప్రీత్ బుమ్రాలాంటి బౌలర్‌ను రెచ్చగొట్టడం ఆస్ట్రేలియాకు ప్రమాదకరమని ఆ జట్టు మాజీ ఆటగాడు మార్క్ వా వ్యాఖ్యానించారు. ‘కొన్‌స్టాస్ ఈ ఘటన నుంచి నేర్చుకోవాలి. ఆఖరి ఓవర్లో బుమ్రాను రెచ్చగొట్టాల్సిన అవసరం అతడికి ఏమాత్రం లేదు. అతడి వల్ల భారత ఆటగాళ్లందరూ ఏకమయ్యారు. కొన్‌స్టాస్ నాలుకను అదుపులో పెట్టుకోకపోతే ప్రత్యర్థి జట్లకు లక్ష్యంగా మారతాడు’ అని హితవు పలికారు.

News January 4, 2025

ఈ వీసాల గురించి తెలుసా?

image

అమెరికా వీసా అనగానే హెచ్‌1-బీ వీసాయే చాలామందికి గుర్తొస్తుంది. కానీ ఇది కాక చాలా రకాల వీసాలున్నాయి.
విద్యార్థులకు F-1(అమెరికా వర్సిటీల్లో డిగ్రీలు చదివేవారికి)
M-1(వొకేషనల్ కోర్సులు చదవాలనుకునేవారికి)
J-1(ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, రిసెర్చ్)
ఉద్యోగులకు L-1(సంస్థ తరఫున లభిస్తుంది)
O-1(పలు రంగాల్లో నిష్ణాతులకు)
P (అథ్లెట్లు, నటులు, కళాకారులకు)
EB1 నుంచి EB5 వరకు(పెట్టుబడి పెట్టేవారికి)

News January 4, 2025

బైడెన్‌కు వచ్చిన ఖరీదైన బహుమతి ప్రధాని మోదీ ఇచ్చిందే!

image

US అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులకు గత ఏడాది వచ్చిన అత్యంత ఖరీదైన బహుమతుల్లో భారత PM మోదీ ఇచ్చిన వజ్రం అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశ ఖజానా వివరాల ప్రకారం.. ల్యాబ్‌లో తయారుచేసిన 7.5 క్యారెట్ల వజ్రాన్ని(రూ.17 లక్షలు), ఎర్రచందనం పెట్టెను, విగ్రహాన్ని, చమురు దీపాన్ని, ఉపనిషత్తుల గురించిన పుస్తకాన్ని బహుమతులుగా ఇచ్చారు. వీటన్నింటి విలువ కలిపి రూ.30 లక్షలకుపైమాటేనని తెలుస్తోంది.