News December 29, 2024
క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారంటే..!

ప్రస్తుతం రుణం కావాలంటే ఏ సంస్థ అయినా క్రెడిట్ స్కోరు చూస్తుంది. లోన్లు, క్రెడిట్ కార్డులు కావాలంటే ఇది తప్పనిసరి. క్రెడిట్ స్కోర్‌ను కొన్ని ఆర్బీఐ అనుమతి పొందిన ఆర్థిక సంస్థలు నిర్వహిస్తుంటాయి. తొలుత ఈఎంఐలు, లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల ప్రకారం లెక్కిస్తారు. అలాగే రేషియో క్రెడిట్ స్కోర్ ఆధారంగా దీనిని నిర్వహిస్తారు. మీ పాత బ్యాంకులు, క్రెడిట్ కార్డుల హిస్టరీ ఆధారంగానూ లెక్కిస్తారు.
Similar News
News September 24, 2025
అభిషేక్ శర్మ అర్ధ శతకం

ఆసియా కప్: బంగ్లాదేశ్ బౌలర్లపై అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. కేవలం 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నారు. 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశారు. గిల్(29) కూడా అద్భుత ఫామ్‌లో కనిపించినా బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. 8 ఓవర్లకు భారత్ స్కోర్ 83/1. అభిషేక్ శర్మ(50*), దూబే(2*) క్రీజులో ఉన్నారు.
News September 24, 2025
రేపు పలు జిల్లాలకు భారీ వర్షసూచన

AP: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. SKL, VZM, మన్యం, అల్లూరి తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
News September 24, 2025
మైనింగ్ సెక్టార్లో సంస్కరణలు: కిషన్ రెడ్డి

TG: మైనింగ్ సెక్టార్లో సంస్కరణలను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘ప్రపంచ దేశాలన్నీ క్రిటికల్ మినరల్స్ కోసం పోటీ పడుతున్నాయి. సెల్ ఫోన్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు , అగ్రికల్చర్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు వీటికి డిమాండ్ ఉంది. ₹32,000Crతో నేషనల్ మినరల్ క్రిటికల్ మిషన్‌ను ప్రారంభించాం. స్క్రాప్ నుంచి మినరల్స్‌ను తీసే ప్రయత్నం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.