News December 29, 2024
సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటన ఖరారు
AP: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. నర్సరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మ.12.40 తర్వాత పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
Similar News
News January 4, 2025
ఏపీలో షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు: YCP
APలో కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయంటూ వైసీపీ ట్వీట్ చేసింది. స్మార్ట్ మీటర్ల బిగింపు తర్వాత నెల రోజుల వ్యవధిలోనే వందల నుంచి వేలాది రూపాయలకు బిల్లులు పెరిగిపోయాయని ఆరోపించింది. నెల్లూరు జిల్లాలో ఓ చిరుద్యోగి ఇంటికి రూ.39,525 బిల్లు వచ్చిందని ఓ ఫొటోను పంచుకుంది. బిల్లుల బాదుడే.. బాదుడు రూపంలో పేదలకు న్యూఇయర్ కానుక ఇస్తున్నావా? అని సీఎం చంద్రబాబును ట్యాగ్ చేసింది.
News January 4, 2025
కాసేపట్లో కోర్టుకు అల్లు అర్జున్
TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. జడ్జి ముందు బన్నీ బెయిల్ పూచీకత్తు పత్రాలను సమర్పించనున్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులపై నిన్న బన్నీకి బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
News January 4, 2025
DAY 2 STUMPS: భారత్ స్కోర్ 141/6
BGT ఐదో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. స్టంప్స్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 141/6 స్కోర్ చేసింది. జడేజా (8), సుందర్ (6) నాటౌట్‌గా నిలిచారు. ప్రస్తుతం భారత్ 145 రన్స్ ఆధిక్యంలో ఉంది. భారత బ్యాటర్లలో పంత్ 61, జైస్వాల్ 22, రాహుల్ 13, గిల్ 13, కోహ్లీ 6, నితీశ్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. AUS బౌలర్లలో బొలాండ్ 4 వికెట్లతో రాణించారు.