News December 29, 2024
సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటన ఖరారు

AP: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. నర్సరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మ.12.40 తర్వాత పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
Similar News
News April 19, 2026
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ట్వీట్లు

రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ్టి 2 ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. నిన్న సర్జరీ చేయించుకున్న Dy.CM పవన్ వేగంగా కోలుకోవాలని YCP చీఫ్ జగన్ ట్వీట్ చేయగా, పవన్ థాంక్స్ చెప్పారు. ఇక జగన్ తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి లోకేశ్ విషెస్ తెలిపారు. నిత్యం రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా పోట్లాడుకునే నేతలు హుందాతనం చూపడం రాజకీయాల విలువలను పెంచుతాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
News April 19, 2026
CUET UG-2026.. మరొకొన్ని గంటలే ఛాన్స్

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG-2026) సబ్జెక్ట్ కరెక్షన్ విండో నేటితో ముగియనుంది. CUET, <
News April 19, 2026
T2OI కెప్టెన్‌గా శ్రేయస్?

T2OI కెప్టెన్‌గా సూర్యను తొలగించాలనుకుంటే సెలక్టర్లకు ఫస్ట్ ఆప్షన్ శ్రేయస్ అయ్యరే అని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. IPLలో శ్రేయస్ నాయకత్వం పట్ల సానుకూలతతోపాటు T20 క్రికెట్‌లో నాలుగో స్థానంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ మరొకరు లేరని పేర్కొంది. పంత్, గిల్ పోటీలో ఉన్నప్పటికీ అయ్యర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు రాసుకొచ్చింది. సూర్యకు కెప్టెన్‌గా మంచి మార్కులు ఉన్నా ఆటగాడిగా ఫెయిలవుతున్నారు.


