News March 16, 2024
బొత్స కుటుంబం నుంచి ముగ్గురు పోటీ
AP: విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈసారి ఆయన కుటుంబం నుంచి YCP తరఫున ముగ్గురు బరిలోకి దిగుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తుండగా.. ఆయన తమ్ముడు అప్పలనర్సయ్య మరోసారి గజపతినగరంలో పోటీ చేస్తున్నారు. కీలకమైన విశాఖ MP సీటులో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి బరిలో ఉన్నారు. గతంలో ఆమె జడ్పీ ఛైర్‌పర్సన్‌గా, బొబ్బిలి, విజయనగరం MPగాను పని చేశారు.
Similar News
News November 24, 2024
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు
TG: అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని, అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలు జరపాలన్నారు. తొలి ఏడాది ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని అధికారులకు సూచించారు.
News November 24, 2024
IPL వేలం: ఇతనిపైనే అందరి చూపు
ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్‌పై అందరి దృష్టి ఉంది. ఈ వేలంలో ఆయనే అత్యధిక ధర పలుకుతారని అంచనా వేస్తున్నారు. రాహుల్, శ్రేయస్, అర్ష్‌దీప్, ఇషాన్, షమీ వంటి ప్లేయర్లు కూడా అధిక ధర పలికే అవకాశముంది. గత సీజన్‌లో స్టార్క్ అత్యధికంగా రూ.24.75 కోట్ల ధర పలకగా ఈసారి సరికొత్త రికార్డులు నమోదవుతాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News November 24, 2024
ఈ నెల 27న వారి ఖాతాల్లో డబ్బులు జమ
TG: 2023-24 ఆర్థిక సంవత్సరం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 24 మధ్య రిటైర్డ్ అయిన కార్మికులకు దీపావళి బోనస్ రిలీజ్ చేస్తున్నట్లు సింగరేణి ఎండీ బలరామ్ తెలిపారు. ఈ నెల 27న వారి ఖాతాల్లోకి రూ.18.27కోట్లు జమ చేస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.93,570 చొప్పున 2,754 మంది కార్మికులకు బోనస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.