News March 16, 2024

బొత్స కుటుంబం నుంచి ముగ్గురు పోటీ

image

AP: విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈసారి ఆయన కుటుంబం నుంచి YCP తరఫున ముగ్గురు బరిలోకి దిగుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తుండగా.. ఆయన తమ్ముడు అప్పలనర్సయ్య మరోసారి గజపతినగరంలో పోటీ చేస్తున్నారు. కీలకమైన విశాఖ MP సీటులో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి బరిలో ఉన్నారు. గతంలో ఆమె జడ్పీ ఛైర్‌పర్సన్‌గా, బొబ్బిలి, విజయనగరం MPగాను పని చేశారు.

Similar News

News April 16, 2026

కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

image

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.

News April 16, 2026

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 528 పాయింట్ల లాభంతో 78,639 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,387 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, టైటాన్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News April 16, 2026

డీలిమిటేషన్.. ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరగొచ్చు?

image

జనాభా ప్రాతిపదికనే MP సీట్ల పెంపు ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో TGలో అసెంబ్లీ స్థానాలు 178కి చేరనున్నాయి. HYD-20, RR, మేడ్చల్‌-12 చొప్పున, NZB, NLG, సంగారెడ్డిలో ఎనిమిదేసి, KMM-7, SRPT-6, MBNR, VKB, SDPT, కామారెడ్డి, KNR, HNK, కొత్తగూడెంలో ఐదేసి, ADB, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, MHBD, WGL, MDK, యాదాద్రి, నాగర్‌కర్నూల్‌లో 4, నారాయణ్‌పేట్, వనపర్తి, గద్వాల్, జనగామ, ASF-3, భూపాలపల్లి-2, ములుగు-1.