News December 30, 2024
ఎవరి ఘనతనో తనదిగా చెప్పుకోవడానికి అలవాటుపడ్డ CBN: వైసీపీ
AP: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సీఎం <<15020850>>చంద్రబాబు<<>> తీరు ‘గల్లీలో చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ’ అనే చందంగా ఉందని YCP ఎద్దేవా చేసింది. ‘గోదావరి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు నీళ్లు తీసుకెళ్లేందుకు జగన్ హయాంలోనే అడుగులు పడ్డాయి. ₹68,028Cr అంచనాతో DPR కోసం WAPCOS సంస్థకు అప్పగించారు. ఎవరో ప్రారంభించిన ప్రాజెక్టులు తన ఘనతే అని చెప్పుకోవడానికి CBN అలవాటుపడ్డారు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News January 5, 2025
విశ్వవేదికలపై మెరిసిన భారతీయ తార
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణె విశ్వవేదికలపై భారత కీర్తిని చాటారు. 2022 ఫిఫా WC ట్రోఫీని ఆవిష్కరించి, ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఆ మరుసటి ఏడాది 2023లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో తళుక్కున మెరిశారు. తెలుగు సినిమా RRRలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చినట్లు ఆమె స్వయంగా స్టేజీపై ప్రకటించారు. 2022లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్‌గానూ దీపిక వ్యవహరించారు. ఇవాళ దీపిక బర్త్‌డే.
News January 5, 2025
పాప్‌కార్న్ Vs మఖాన.. ఏది తింటే మంచిది?
పాప్‌కార్న్ కంటే మఖానాలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. ఫ్యాట్ కూడా తక్కువ మోతాదులో ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ఉండి ఎముకలు, కండరాలు దృఢంగా మారడానికి దోహదపడుతుంది. అయితే పాప్‌కార్న్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్నా దాన్ని తయారుచేసే విధానాల వల్ల బటర్, ఆయిల్, సాల్ట్ కలిసి అందులోని న్యూట్రిషన్ ఉపయోగాలు శరీరానికి అందవు.
News January 5, 2025
అందుకే భూమి లేనివారికీ రూ.12వేలు: CM
TG: సాగు చేసేవారితో పాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకూ రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. భూమి లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం కూడా తమను ఆదుకోవడం లేదని పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందని సీఎం చెప్పారు. వారు కూడా సమాజంలో భాగమేనని గుర్తించి, ఏటా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.