News December 30, 2024

ఎవరి ఘనతనో తనదిగా చెప్పుకోవడానికి అలవాటుపడ్డ CBN: వైసీపీ

image

AP: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సీఎం <<15020850>>చంద్రబాబు<<>> తీరు ‘గల్లీలో చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ’ అనే చందంగా ఉందని YCP ఎద్దేవా చేసింది. ‘గోదావరి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు నీళ్లు తీసుకెళ్లేందుకు జగన్ హయాంలోనే అడుగులు పడ్డాయి. ₹68,028Cr అంచనాతో DPR కోసం WAPCOS సంస్థ‌కు అప్పగించారు. ఎవ‌రో ప్రారంభించిన ప్రాజెక్టులు తన ఘనతే అని చెప్పుకోవడానికి CBN అలవాటుపడ్డారు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News July 7, 2025

రెబలోడి దెబ్బ మర్చిపోయారా?: ప్రభాస్ ఫ్యాన్స్

image

డిసెంబర్ 5న ప్రభాస్ ‘ది రాజాసాబ్’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ క్లాష్ కన్ఫామ్ అయిపోయింది. కొందరు బాలీవుడ్ అభిమానులు ప్రభాస్ మూవీ వాయిదా వేసుకోవాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. “ప్రభాస్‌తో పోటీపడి షారుక్‌ఖానే నిలబడలేకపోయారు. సలార్‌తో పోటీగా రిలీజైన ‘డుంకీ’కి ఏమైందో అప్పుడే మర్చిపోయారా?”అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.

News July 7, 2025

ఉగ్రవాదంపై BRICS సదస్సులో తీర్మానం

image

BRICS దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కౌంటర్ టెర్రరిజంపై తీర్మానం కూడా చేశాయి. ‘క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యల కట్టడికి పోరాడతాం. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరిని ఉపేక్షించం. ఉగ్రమూకల అణచివేతలో దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం’ అని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.

News July 7, 2025

రూ.23 లక్షలతో దుబాయ్ గోల్డెన్ వీసా

image

భారత్, బంగ్లాదేశ్ ప్రజలు లక్ష ఏఈడీ (రూ.23.30 లక్షలు)లు చెల్లిస్తే దుబాయ్ గోల్డెన్ వీసా పొందొచ్చు. గతంలో రూ.4.66 కోట్లకుపైగా పెట్టుబడి పెడితే గోల్డెన్ వీసా మంజూరు చేసేది. ఇప్పుడు డైరెక్ట్‌గా డబ్బు చెల్లించి వీసా తీసుకోవచ్చు. ఈ వీసా పొందినవారు తమ ఫ్యామిలీతో దుబాయ్‌లో నివసించవచ్చు. డ్రైవర్లు, పనిమనుషులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా జాబ్, బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. జీవితకాలం అక్కడే ఉండొచ్చు.