News December 31, 2024

బొర్రా గుహల్లో మహేశ్ బాబు సినిమా షూటింగ్?

image

మహేశ్ బాబుతో తాను తెరకెక్కించే సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను APలోని బొర్రా గుహల్లో తీయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జక్కన్న తన టీమ్‌తో గుహల్ని సందర్శించారు. అధికశాతం టాకీ పార్ట్‌ను ఆఫ్రికా అడవుల్లోనే షూట్ చేయొచ్చని సమాచారం. SSMB29గా వ్యవహరిస్తున్న ఈ మూవీ షూట్ వచ్చే ఏడాది వేసవి నుంచి ప్రారంభం కానుంది. ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

Similar News

News January 5, 2025

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ ఫిక్స్?

image

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ ‘డ్రాగన్‌’(ప్రచారంలో ఉన్న పేరు)కి హీరోయిన్‌ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రుక్మిణీ వసంత్‌‌ను ఎంపిక చేసినట్లు సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. విదేశాల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకున్న NTR ఈ మూవీ కోసం నెలాఖరున కర్ణాటక వెళ్తారని తెలుస్తోంది. అటు హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ నటించిన వార్-2 ఆగస్టులో రిలీజ్ కానుంది.

News January 5, 2025

స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ఎప్పుడంటే?

image

తెలంగాణలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా అకడమిక్ క్యాలెండర్‌లో జనవరి 13 నుంచి 17 వరకు సెలవులు ఇచ్చారు. జనవరి 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో వరుసగా 7 రోజులు వచ్చే అవకాశం ఉంది. సెలవులపై కొంత గందరగోళం నెలకొనడంతో త్వరలోనే సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అటు ఏపీలో జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ఇవ్వనున్నారు.

News January 5, 2025

రేపు అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: ఐదో తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్లకు రేపు అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది. కాగా ఇప్పటికే ఇతర ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందాయి. మరోవైపు పింఛన్లను కూడా డిసెంబర్ 31నే ప్రభుత్వం పంపిణీ చేసిన విషయం తెలిసిందే.