News December 31, 2024
బొర్రా గుహల్లో మహేశ్ బాబు సినిమా షూటింగ్?
మహేశ్ బాబుతో తాను తెరకెక్కించే సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను APలోని బొర్రా గుహల్లో తీయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జక్కన్న తన టీమ్‌తో గుహల్ని సందర్శించారు. అధికశాతం టాకీ పార్ట్‌ను ఆఫ్రికా అడవుల్లోనే షూట్ చేయొచ్చని సమాచారం. SSMB29గా వ్యవహరిస్తున్న ఈ మూవీ షూట్ వచ్చే ఏడాది వేసవి నుంచి ప్రారంభం కానుంది. ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.
Similar News
News January 16, 2025
3 రోజులు జాగ్రత్త
TGలో చలి తీవ్రత మరో మూడు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పొగమంచు ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో APలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
News January 16, 2025
విషాదం.. ప్రకృతి వైపరీత్యాలకు 3,200 మందికి పైగా మృతి
దేశంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా 3,200 మందికిపైగా మరణించినట్లు వాతావరణ వార్షిక నివేదిక-2024 పేర్కొంది. అత్యధికంగా 1,374 మంది పిడుగుపాటుకు గురై మరణించగా, వరదల వల్ల 1,287 మంది, వడదెబ్బ కారణంగా 459 మంది చనిపోయారని వెల్లడించింది. వరదలతో అత్యధికంగా కేరళలో, పిడుగుపాటుతో బిహార్‌లో మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు గత ఏడాది అత్యధిక ఉష్ణ సంవత్సరంగా నిలిచింది.
News January 16, 2025
కొత్త పథకాలు.. నేటి నుంచే ఫీల్డ్ సర్వే
TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తీసుకురానున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం నేటి నుంచి ఫీల్డ్ సర్వే చేయనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. దీని ఆధారంగా 25న తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.