News December 31, 2024
జనవరి 3న క్యాబినెట్ భేటీ

TG: జనవరి 3న సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. రైతు భరోసా విధివిధానాలు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేల చొప్పున చెల్లింపు సహా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు. వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు తేదీతో పాటు రైతుభరోసా అమలు తేదీపైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ నెలలోనే క్యాబినెట్ భేటీ జరగాల్సి ఉండగా మన్మోహన్ మరణంతో వాయిదా పడింది.
Similar News
News January 25, 2026
‘సభా సార్’తో గ్రామసభ రికార్డుల డిజిటలైజేషన్

TG: రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గ్రామసభల్లో ‘సభా సార్’ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలని కేంద్రం కోరింది. దీంతో సమావేశాల్లో చర్చించిన అంశాల ఆడియో/వీడియో రికార్డింగ్స్‌తో ఆటోమేటిక్‌గా సమావేశ మినిట్స్ రూపొందించవచ్చని తెలిపింది. దీని వల్ల శ్రమ తగ్గి, పారదర్శకత పెరుగుతుందని తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
News January 25, 2026
పద్మ అవార్డుల ప్రకటన

వివిధ రంగాల్లో సేవలందించిన 45 మంది వ్యక్తులకు కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డి(పాడి, పశుసంవర్ధక విభాగం), డాక్టర్ కుమారస్వామి తంగరాజ్(జన్యు సంబంధ పరిశోధనలు), తమిళనాడుకు చెందిన నటేశన్ తదితరులు ఉన్నారు.
News January 25, 2026
అగ్నిప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

TG: నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో <<18951833>>మృతుల<<>> కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ హరిచందనకు ఆదేశాలు జారీ చేశారు. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అగ్నిమాపక నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


