News December 31, 2024

Stock Market: చివరి సెషన్ నష్టాలతో ఆరంభం

image

2024లో చివ‌రి ట్రేడింగ్ సెష‌న్‌ను బెంచ్ మార్క్ సూచీలు న‌ష్టాల‌తో ఆరంభించాయి. ప్ర‌స్తుతం సెన్సెక్స్ 463 పాయింట్ల న‌ష్టంతో 77,784 వ‌ద్ద‌, నిఫ్టీ 102 పాయింట్లు కోల్పోయి 23,542 వ‌ద్ద క‌దులుతున్నాయి. ఐటీ షేర్లు అత్య‌ధికంగా 2% న‌ష్టాల‌తో ట్రేడ్ అవుతున్నాయి. కీల‌క‌మైన బ్యాంకు, ఫైనాన్స్‌, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలపై అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. ONGC, BEL గ్రీన్‌లో ఉన్నాయి. India Vix 14.29గా ఉంది.

Similar News

News January 5, 2025

ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే: గంభీర్

image

BGT సిరీస్ ఓటమి అనంతరం టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ ఆటగాళ్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్లేయర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేశారు. ‘ఒకవేళ వారు డొమెస్టిక్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోతే జట్టు కోరుకునే ఆటగాళ్లను ఎప్పటికీ పొందలేము’ అని పేర్కొన్నారు. జాతీయ జట్టులో చోటుదక్కించుకున్న తర్వాత చాలా మంది దేశవాళీ క్రికెట్‌ను చిన్నచూపు చూస్తోన్న విషయం తెలిసిందే.

News January 5, 2025

ఢిల్లీ గ్యారంటీల‌ను రెడీ చేస్తున్న కాంగ్రెస్‌

image

దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి ఎన్నిక‌లో ప‌లు హామీల‌ను గ్యారంటీల పేరుతో ప్ర‌క‌టిస్తున్న కాంగ్రెస్ తాజాగా ఢిల్లీ ఎన్నిక‌ల‌పై దృష్టిసారించింది. Febలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ కోసం సోమవారం నుంచి పలు దశల్లో గ్యారంటీల‌ను ప్ర‌క‌టించ‌నుంది. ఢిల్లీలో మ‌హిళ‌ల‌కు ఆప్ ప్ర‌క‌టించిన ₹2,100 సాయం కంటే అధికంగా కాంగ్రెస్ హామీ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఆరోగ్య బీమా, ఉచిత రేష‌న్, విద్యుత్‌ హామీల‌పై క‌స‌ర‌త్తు తుదిద‌శ‌కు చేరుకుంది.

News January 5, 2025

రేపటి నుంచి OP, EHS సేవలు బంద్

image

AP: రేపటి నుంచి NTR వైద్యసేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో OP, EHS సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. రూ.3వేల కోట్ల ప్రభుత్వ బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరమైందని చెప్పింది. ప్రభుత్వం మీద గౌరవంతో కేవలం 2 సేవలే నిలిపేస్తున్నట్లు పేర్కొంది. 25 వరకూ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు, అప్పటికి రూ.1500cr బకాయిలు విడుదల చేయకపోతే సేవలు పూర్తిగా నిలిపేస్తామని హెచ్చరించింది.