News December 31, 2024
2024కు గుడ్‌బై చెప్పిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు 2024కు ఫ్లాట్‌గా వీడ్కోలు పలికాయి. సెన్సెక్స్ 78,139(-109) వద్ద, నిఫ్టీ 23,644(-0.10) పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ఐటీ షేర్లు అత్యధికంగా 1.14% నష్టపోయాయి. మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆయిల్&గ్యాస్ షేర్లకు కొత్త ఏడాదికి ముందు కొనుగోళ్ల మద్దతు లభించింది. Bel, Ongc, Kotak Bank టాప్ గెయినర్స్. Adani Ent, Tech Mahindra, TCS టాప్ లూజర్స్.
Similar News
News January 26, 2026
తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 26, 2026
ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్‌కు పద్మశ్రీ

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్‌ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్‌లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్‌కు బ్రాండ్‌ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.


