News March 16, 2024

ఐపీఎల్ ఇండియాలోనే

image

IPL రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహిస్తారని వస్తున్న వార్తలను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఖండించారు. ‘మేము కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదిస్తున్నాం. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. త్వరలో ఐపీఎల్ రెండో ఫేజ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుంది. విదేశాలకు తరలించే అవకాశమే లేదు’ అని ఆయన చెప్పారు.

Similar News

News September 29, 2024

ఆ సెంటిమెంట్ కొనసాగిస్తున్న ఎన్టీఆర్?

image

దేవర హిట్ కొట్టడంతో నెట్టింట తారక్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఫ్లాప్ చూసిన దర్శకుడికి వెంటనే హిట్ ఇవ్వాలంటే తారక్ తర్వాతేనని కొనియాడుతున్నారు. బాబీకి సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత జై లవకుశ, అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్‌కు అరవింద సమేత, హార్ట్‌ఎటాక్ మూవీ తర్వాత టెంపర్‌తో పూరీకి, నేనొక్కడినే తర్వాత సుకుమార్‌కు నాన్నకు ప్రేమతో, ఆచార్య తర్వాత కొరటాలకు దేవరతో హిట్స్ ఇచ్చారని గుర్తుచేసుకుంటున్నారు.

News September 29, 2024

మూసీ ధన దాహానికి లక్షల జీవితాలు బలి: KTR

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రూ.1.50 లక్షల కోట్ల మూసీ ధన దాహానికి లక్షల జీవితాలు బలవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరాలను నిర్మించి కన్న బిడ్డలకు ఇవ్వలేకపోతున్నామని తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. భార్య కడుపుతో ఉంది కనికరించరా అని ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్నారు. తొందరపడి మీ ప్రాణాలు బలితీసుకోవద్దు. న్యాయస్థానాలు ఉన్నాయి. మేమూ ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.

News September 29, 2024

సిట్‌పై మాకు నమ్మకం లేదు: గుడివాడ అమర్నాథ్

image

AP: తిరుమల ప్రతిష్ఠను సీఎం చంద్రబాబు దెబ్బ తీశారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ‘కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. హామీల అమలులో విఫలమై తిరుమల లడ్డూ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే సీబీఐ విచారణ కోరలేదు. దమ్ముంటే లడ్డూ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి. ఆయన ఏర్పాటు చేసిన సిట్‌పై మాకు నమ్మకం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.