News March 16, 2024

ఐపీఎల్ ఇండియాలోనే

image

IPL రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహిస్తారని వస్తున్న వార్తలను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఖండించారు. ‘మేము కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదిస్తున్నాం. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. త్వరలో ఐపీఎల్ రెండో ఫేజ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుంది. విదేశాలకు తరలించే అవకాశమే లేదు’ అని ఆయన చెప్పారు.

Similar News

News March 15, 2026

ఈ జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ మధ్యాహ్నం నుంచి రేపు 8.30am వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడటానికి ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక రానున్న 5 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2-4డిగ్రీలు తగ్గుతాయంది.

News March 15, 2026

చంద్రబాబుకు అల్లు అర్జున్ థాంక్స్

image

AP సీఎం చంద్రబాబు నాయుడికి అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. శిరీష్, నయనిక దంపతులను <<19384357>>ఆశీర్వదించడానికి<<>> శనివారం అల్లు ఇంటికి చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌లో విదేశాల్లో ఉన్న ఐకాన్ స్టార్.. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన Xలో పోస్ట్ చేసి సీఎంకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.

News March 15, 2026

సిలిండర్ డోమ్ ఆకారంలోనే ఎందుకు?

image

LPG గ్యాస్‌ను సిలిండర్‌లో చాలా ఎక్కువ ఒత్తిడి వద్ద నింపుతారు. చతురస్రం లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే మూలల వద్ద ఒత్తిడి ఎక్కువై పేలిపోయే ప్రమాదం ఉంటుంది. డోమ్ ఆకారంలో ఒత్తిడి అన్ని వైపులా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే సిలిండర్లను దొర్లించడం సులభం అవుతుంది. కార్మికులు మోయాల్సిన బాధ తప్పుతుంది. పూర్తిగా గుండ్రంగా ఉంటే ఒకచోట నిలపడం కష్టం. తయారీ ఖర్చు కూడా తక్కువ.