News January 1, 2025

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

image

TG: విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్‌ను తగ్గించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. NCERT సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని సైన్స్‌తో పాటు ఇతర సబ్జెక్టుల్లో పాఠాలను కుదించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌లో, 2026-27 నుంచి సెకండియర్‌లో దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కెమిస్ట్రీలో 30%, ఫిజిక్స్‌లో 15%, జువాలజీలో 5-10% వరకు సిలబస్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 6, 2025

జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా?

image

TGలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, కాలుష్య తీవ్రత వల్ల వైరల్ ఫీవర్స్, ఫ్లూ వైరస్ వ్యాప్తి బాగా పెరిగింది. దీంతో దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కరైనా జ్వరం/దగ్గు/జలుబుతో బాధపడుతున్నారు. కొందరిని గొంతు ఇన్ఫెక్షన్ వేధిస్తోంది. మరోవైపు చైనాలో విజృంభిస్తున్న HMPV వైరస్ లక్షణాలు కూడా ఇలాగే ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏ లక్షణాలతో ఎక్కువమంది ఆసుపత్రుల్లో చేరుతున్నారనే వివరాలను సేకరిస్తోంది. మీరూ జ్వరబాధితులేనా?

News January 6, 2025

చర్లపల్లి రైల్వే టర్మినల్ నేడే ప్రారంభం

image

TG: సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను PM మోదీ ఇవాళ ఉదయం వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.413 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్ నిర్మించారు. సికింద్రాబాద్‌కు బదులుగా ఇకపై చాలా రైళ్లు ఇక్కడే హాల్టింగ్ తీసుకుంటాయి.

News January 6, 2025

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

image

AP: పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా పడ్డాయి. వైకుంఠ ఏకాదశి, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో జనవరి 8న జరగాల్సిన పరీక్షలను జనవరి 11న.. అనంతపురంలో 8-10వరకు జరగాల్సిన పరీక్షలను 17-20, చిత్తూరులో 8, 9న జరగాల్సిన ఎగ్జామ్స్‌ను 17, 18 తేదీలకు మార్చినట్లు పేర్కొంది.