News January 1, 2025

అయోధ్య రామయ్యను దర్శించుకున్న 2 లక్షల మంది

image

అయోధ్యలోని బాల రాముడి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తుండగా ఇప్పటికే 2 లక్షల మంది రామ్‌లల్లాను దర్శించుకున్నట్లు రామజన్మభూమి ట్రస్ట్ పేర్కొంది. రాత్రి 9 గంటల వరకు ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. మీలో ఎవరైనా అయోధ్యకు వెళ్లారా? ఇవాళ ఏ ఆలయాలను సందర్శించారో కామెంట్ చేయండి.

Similar News

News January 6, 2025

అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు

image

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ <<15069986>>పోలీసులు మరోసారి<<>> నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన వెళ్తే గంటలోగా పర్యటన పూర్తి చేసుకోవాలన్నారు. దీనిని రహస్యంగా ఉంచాలని, ఎస్కార్ట్ భద్రత కల్పిస్తామన్నారు.

News January 6, 2025

కేంద్రం సహకరిస్తే ట్రిలియన్ ఎకానమీ సాధిస్తాం: CM

image

TG: మెట్రో రైలు విస్తరణకు, ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభోత్సవంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని అన్నారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి డ్రై పోర్ట్ ఇవ్వాలని కోరారు.

News January 6, 2025

భారత్‌తో పెట్టుకుంటే ఇలాగే అవుతుంది.. ట్రూడోపై సెటైర్లు

image

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకి <<15076593>>రాజీనామా చేస్తారని<<>> వార్తలు రావడంతో భారతీయులు ఖుషీ అవుతున్నారు. ఖలిస్థానీలకు మద్దతు తెలిపి, ఇండియాపై నిరాధార ఆరోపణలు చేసినందుకు తగిన శాస్తి జరిగిందని పోస్టులు చేస్తున్నారు. ఇండియాకు హాని చేసే శక్తులు కెనడాలో ఉన్నా.. వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సపోర్ట్ చేశారని ఫైరవుతున్నారు. భారత్‌తో పెట్టుకుంటే ఇలాగే అవుతుందని ఎద్దేవా చేస్తున్నారు.