News January 1, 2025
BGT: చివరి టెస్టుకు వర్షం ముప్పు
BGTలో భాగంగా సిడ్నీ వేదికగా ఎల్లుండి నుంచి జరిగే చివరి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వెదర్ రిపోర్టు వెల్లడించింది. ఈ మ్యాచ్ రద్దయినా, డ్రా అయినా ఆసీస్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంటుంది. దీంతో భారత్ WTC ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. మ్యాచ్‌లో రోహిత్ సేన గెలిస్తే కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. ఈ గ్రౌండులో ఇరు జట్ల మధ్య 13 మ్యాచ్‌లు జరగగా IND ఒక్కటే గెలిచింది. 5 ఓడిపోగా, 7 డ్రాగా ముగిశాయి.
Similar News
News January 6, 2025
మాటల యుద్ధం: కుమార స్వామి X సిద్ద రామయ్య
కర్ణాటక ప్రభుత్వం ప్రతి కాంట్రాక్టులో 60% కమీషన్ తీసుకుంటోందని కేంద్ర మంత్రి కుమార స్వామి ఆరోపించారు. తుమకూరులో కాంగ్రెస్ నేత స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను సీఎం సిద్ద రామయ్య కొట్టిపారేశారు. ఈ విషయమై కుమార స్వామి ఆరోపణలు చేయడం కాకుండా, ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. విపక్షాలు ఉన్నది కేవలం ఆరోపణలు చేయడానికి కాదన్నారు.
News January 6, 2025
ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
ఐర్లాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ భారత మహిళల జట్టును ప్రకటించింది. ఈ టూర్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తోపాటు సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌కు విశ్రాంతినిచ్చింది. 15 మందితో కూడిన జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తారు. జట్టు: మంధాన (C), దీప్తి శర్మ, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా, రిచా, తేజల్, రాఘవి, మిన్ను మణి, తనూజ, ప్రియా, సాధు, సైమా, సయాలి.
News January 6, 2025
‘పుష్ప-2’ సంచలనం
భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అల్లు అర్జున్ ‘పుష్ప-2’ నిలిచింది. ఈ సినిమా నిన్నటివరకు థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రూ.1,831 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొంది. బాహుబలి-2 లైఫ్ టైమ్ కలెక్షన్లు రూ.1,810 కోట్లను దాటేసి రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దంగల్(రూ.2వేల కోట్లకుపైగా) తొలి స్థానంలో ఉంది.