News January 1, 2025
BGT: చివరి టెస్టుకు వర్షం ముప్పు
BGTలో భాగంగా సిడ్నీ వేదికగా ఎల్లుండి నుంచి జరిగే చివరి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వెదర్ రిపోర్టు వెల్లడించింది. ఈ మ్యాచ్ రద్దయినా, డ్రా అయినా ఆసీస్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంటుంది. దీంతో భారత్ WTC ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. మ్యాచ్‌లో రోహిత్ సేన గెలిస్తే కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. ఈ గ్రౌండులో ఇరు జట్ల మధ్య 13 మ్యాచ్‌లు జరగగా IND ఒక్కటే గెలిచింది. 5 ఓడిపోగా, 7 డ్రాగా ముగిశాయి.
Similar News
News January 20, 2025
పేరుకే ‘పెద్దన్న’.. జీతం వారికన్నా తక్కువే
పెద్దన్నగా పేరొందిన అమెరికా అధ్యక్షుడి జీతం పలు దేశాధినేతల కంటే తక్కువే. యూఎస్ అధ్యక్షుడి గౌరవ వేతనం ఏడాదికి రూ.4 లక్షల డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3.46 కోట్లు. సింగపూర్ ప్రధాని జీతం ఏడాదికి సుమారు రూ.13.85 కోట్లు, హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలరీ రూ.6 కోట్లు, స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి రూ.4.9 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా వారికి అదనపు భత్యాలు అందుతాయి.
News January 20, 2025
శ్రీవారి భక్తులకు అలర్ట్
AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో ముగిశాయి. ఇవాళ భక్తులను ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో టీటీడీ అనుమతించనుంది. నేడు ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది డిసెంబర్‌లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి.
News January 20, 2025
పవిత్రతో రిలేషన్‌పై నరేశ్ ఆసక్తికర కామెంట్స్
నటి పవిత్ర వచ్చాక తన జీవితం కాస్త మెరుగుపడిందని సినీ నటుడు నరేశ్ చెప్పారు. ఇప్పుడు లైఫ్ టైటానిక్ ఒడ్డుకు చేరినట్లుగా ఉందని తనదైన శైలిలో చమత్కరించారు. అర్థం చేసుకునే మనుషులు జీవితంలో ఉంటే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగిస్తామన్నారు.