News January 2, 2025

పెంపుడు కుక్క మృతి.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న యజమాని

image

బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక రాజశేఖర్(33) ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కకు బౌన్సీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. మంగళవారం అది అనారోగ్యంతో చనిపోగా ఖననం చేశారు. అనంతరం ఇంటికి వచ్చిన రాజశేఖర్.. కుక్కకు ఉపయోగించిన చైన్‌తోనే ఉరేసుకొని చనిపోయాడు.

Similar News

News January 26, 2026

ఇండోర్‌‌లో కలుషిత నీరు.. 28కి చేరిన మరణాలు

image

MPలోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. భగీరథ్‌పుర‌లో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోవ్‌లో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అటు ప్రభుత్వం 21 మంది మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. కాగా బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఇండోర్ కలెక్టర్ శివమ్ వర్మ తెలిపారు.

News January 26, 2026

312 పోస్టులు.. అప్లైకి మూడు రోజులే ఛాన్స్

image

RRB ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి 3 రోజులే ( JAN 29) సమయం ఉంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 26, 2026

RITESలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>RITES<<>> లిమిటెడ్‌లో 14 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE/BTech (సివిల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జనవరి 27, 28తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి జీతం నెలకు రూ.1,00000-రూ.1,60,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/