News January 2, 2025
అదే జరిగితే NDA బలం 301కి జంప్

మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి! చీలిపోయిన NCPని మళ్లీ ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే జరిగితే లోక్‌సభలో NDAకు కొత్తబలం రావడం ఖాయం. ప్రస్తుతం ఈ కూటమికి 293 ఎంపీలు ఉన్నారు. INDIA కూటమిలోని NCP SPకి 8 మంది సభ్యులున్నారు. NCP కలిస్తే వారంతా అధికార పక్షం వైపు వస్తారు. దీంతో NDA బలం 301కి పెరుగుతుంది. చెరకు రైతుల సమస్యలంటూ ఈ మధ్యే మోదీతో శరద్ పవార్ ప్రత్యేకంగా భేటీ అవ్వడం గమనార్హం.
Similar News
News January 21, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News January 21, 2026
‘2000s’ గ్యాంగ్.. క్రికెటర్ల సెల్ఫీ వైరల్

2000దశకంలో క్రికెట్ చూడటం మొదలుపెట్టిన వారికి పైఫొటోలో ఎవరో ఒకరు ఫేవరెట్ ప్లేయరై ఉంటారు. ఓపెనర్‌గా సెహ్వాగ్ బాదుడు, సిక్సర్ల వీరుడు యువరాజ్, ఫీల్డింగ్‌లో కైఫ్ దూకుడు, బౌలింగ్‌లో అగార్కర్, నెహ్రా సత్తా.. ఇలా అప్పట్లో వీరి ఆటకు క్రేజే వేరు. తాజాగా వీరంతా ఒకే దగ్గర కలుసుకొని సెల్ఫీ దిగారు. లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కుమారుడు అంగద్ బేడీ, స్పోర్ట్స్ ప్రజెంటర్ గౌరవ్ కపూర్ కూడా వీరితో ఉన్నారు.
News January 21, 2026
‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CBN

AP: అగ్రిటెక్ విధానం అమలుతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని CBN తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతాను. విశాఖకు గూగుల్ సంస్థ రాక గొప్ప ముందడుగు. దీని కోసం లోకేశ్ ఎంతో కష్టపడ్డారు. గ్రీన్ ఎనర్జీ, అమ్మోనియా గురించి లోకం చర్చిస్తున్న సమయంలో AP ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోంది. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతున్నాం’ అని దావోస్‌లో మీడియాతో పేర్కొన్నారు.


